టీవీల రంగంలో దూసుకుపోతున్న దేశీయ టీవీ దిగ్గజం దైవా కంపెనీ ఓ నూతన ఎల్ఈడీ స్మార్ట్‌టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది.డీ32ఎస్‌బీఏఆర్ మోడల్ నంబర్ పేరిట ఈ టీవీ మార్కెట్లో విడుదలైంది. ఇందులో క్రికెట్ పిక్చర్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల వీక్షకులకు క్రికెట్ మ్యాచ్‌ల వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్ అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ టీవీలో 32 ఇంచుల హెచ్డీ డిస్ప్లేను ఏర్పాటు చేయగా ఈ డిస్ప్లే 1366 x 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది.
ఇందులో 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 3 హెచ్డీఎంఐ పోర్టులు, 2 యూఎస్బీ పోర్టులు, 1 ఆప్టికల్ అవుట్‌పుట్ పోర్టు, వైఫై, ల్యాన్ ఫీచర్లను అందిస్తున్నారు. కాగా దైవా డీ32ఎస్‌బీఏఆర్ టీవీని రూ.12,990 ధరకు అందిస్తున్నారు. దీన్ని దైవా అఫిషియల్ వెబ్‌సైట్‌తోపాటు పలు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ టీవీపై 2 సంవత్సరాల వారంటీని అందిస్తున్నారు. ఇందుకు గాను వినియోగదారులు టీవీని కొనుగోలు చేశాక మై దైవా యాప్‌లో ప్రొడక్ట్‌ను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
షియోమీకి చెందిన ఎంఐ టీవీకి పోటీగా దైవా 55 అంగుళాల సైజు కలిగిన 4కే స్మార్ట్ టీవీ మోడల్ (డీ55యూవీసీ6ఎన్)ను విడుదల చేసిన సంగతి విదితమే. దీని ధర రూ.36,999గా ఉంది. ఏ గ్రేడ్ ప్యానెల్ ఇందులో ఉంటుంది. మరింత స్పష్టతతో చూసేందుకు ఇది అనుకూలిస్తుంది. స్క్రీన్ క్యాప్చర్, కాంబ్ ఫిల్టర్, పిక్చర్ ఎన్ హాన్స్ మెంట్ ఫీచర్లతో వస్తుంది. డాల్బీ సౌండ్ టెక్నాలజీని ఇందులో ఏర్పాటు చేసినట్టు కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 4కే స్మార్ట్ టీవీ అయిన ఇందులో 8జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 1జీబీ ర్యామ్, హెచ్ డీఎంఐ, యూఎస్ బీ, ఈథర్ నెట్ పోర్ట్ లు కూడా ఉంటాయి. ఎంఐ 55 అంగుళాల 4కే స్మార్ట్ టీవీ ధరనురూ. 39,999 నుంచి రూ.44,999కు పెంచిన విషయం తెలిసిందే.
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ దైవా à°Žà°²à±â€Œà°ˆà°¡à±€ à°¸à±à°®à°¾à°°à±à°Ÿà±â€Œà°Ÿà±€à°µà±€ à°¡à±€32à°Žà°¸à±â€Œà°¬à±€à°à°†à°°à± మోడలౠ32 ఇంచà±à°² హెచà±â€Œà°¡à±€ à°¡à°¿à°¸à±â€Œà°ªà±à°²à±‡ దైవా à°¡à±€32à°Žà°¸à±â€Œà°¬à±€à°à°†à°°à± టీవీ దైవా à°¡à±€32à°Žà°¸à±â€Œà°¬à±€à°à°†à°°à± టీవీ ఫీచరà±à°²à± దైవా à°¡à±€32à°Žà°¸à±â€Œà°¬à±€à°à°†à°°à± టీవీ à°§à°°